• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
Swaadhyaayam

Swaadhyaayam

  • Home
  • Sthotras
    • Ganesha
    • Shiva
    • Surya
    • Navagraha
    • Vishnu
  • Astrology
    • Fundamentals
    • Marriage Compatibility
    • Muhurthas
  • Blog
  • Temples
  • Festivals

Navaratri celebrations

నవదుర్గలు – నవరాత్రి అలంకారాలు

ప్రతి రోజు అమ్మవారు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ (విజయవాడ), శృంగేరి శ్రీ శారదాంబ అలంకారాల వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి; ప్రతి అలంకారానికి విశేష వర్ణన తరువాతి పేజీల్లో ఇవ్వబడింది.

తేదీ (2026) తిథి విజయవాడ కనకదుర్గ అలంకారం శృంగేరి శారదాంబ అలంకారం
అక్టోబర్ 10 (శని) పూర్వ నవరాత్రి ఆలయ నిత్య పూజలు మహాభిషేకం – జగత్ప్రసూతికా అలంకారం
అక్టోబర్ 11 (ఆది) పాడ్యమి (1) శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి శ్రీ బాల త్రిపుర సుందరి
అక్టోబర్ 12 (సోమ) విదియ (2) శ్రీ గాయత్రీ దేవి హంస వాహనం – గాయత్రి (బ్రాహ్మి)
అక్టోబర్ 13 (మంగళ) తదియ (3) శ్రీ అన్నపూర్ణా దేవి వృషభ వాహనం (మాహేశ్వరి)
అక్టోబర్ 14 (బుధ) చవితి (4) శ్రీ మహా చండీ దేవి (లేదా మీనాక్షీ దేవి) మయూర వాహనం (కౌమారి)
అక్టోబర్ 15 (గురు) పంచమి (5) శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి గరుడ వాహనం (వైష్ణవి)
అక్టోబర్ 16 (శుక్ర) షష్ఠి (6) శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం) సరస్వతీ ఆవాహన – వీణా శారదా అలంకారం
అక్టోబర్ 17 (శని) సప్తమి (7) శ్రీ మహాలక్ష్మీ దేవి ఇంద్రాణి అలంకారం
అక్టోబర్ 18 (ఆది) అష్టమి (8) · దుర్గాష్టమి శ్రీ దుర్గా దేవి మోహినీ అలంకారం
అక్టోబర్ 19 (సోమ) నవమి (9) · మహానవమి శ్రీ మహిషాసుర మర్దినీ దేవి శతచండీ పూర్ణాహుతి – రాజరాజేశ్వరీ అలంకారం
అక్టోబర్ 20 (మంగళ) దశమి (10) · విజయదశమి శ్రీ రాజరాజేశ్వరీ దేవి (సాయంత్రం హంస వాహన తెప్పోత్సవం) సింహ వాహన అలంకారం
అక్టోబర్ 21 (బుధ) ఏకాదశి నిత్య పూజలు పునఃప్రారంభం గజలక్ష్మీ అలంకారం

గమనిక: అలంకారాలు, సమయాలు దేవస్థానం ప్రకటనల ప్రకారం మారే అవకాశం ఉంది; దర్శనానికి వెళ్లేముందు అధికారిక ప్రకటనను చూడండి.

దసరా పురాణ గాథలు

1.శ్రీరాముని విజయం (ఉత్తర, పశ్చిమ భారత సంప్రదాయం)

సీతాపహరణం చేసిన లంకాధిపతి రావణునిపై శ్రీరాముడు సుదీర్ఘ యుద్ధం చేశాడు. లక్ష్మణుడు, హనుమంతుడు, వానరసేన అండగా నిలవగా, దశమి నాడు రావణ సంహారం జరిగింది. రావణుని పది తలలు మనిషిలోని దుర్గుణాలకు ప్రతీక. ఈ విజయానికి గుర్తుగా రామ్‌లీలా నాటకాలు, రావణ దహనం జరుపుతారు.

2.దుర్గాదేవి – మహిషాసుర సంహారం (తూర్పు, దక్షిణ భారత సంప్రదాయం)

దేవతలకైనా, మానవులకైనా అజేయుడైన మాయావి మహిషాసురుడు ముల్లోకాలను గడగడలాడించాడు. అప్పుడు దేవతల తేజస్సులన్నీ ఏకమై దివ్య స్త్రీ శక్తి దుర్గాదేవిగా అవతరించింది. తొమ్మిది రాత్రులు తీవ్ర పోరాటం చేసి, పదవ నాడు మహిషాసురుని సంహరించింది. అజ్ఞానంపై జ్ఞాన జ్యోతి, దౌర్జన్యంపై ధైర్యం సాధించిన విజయానికి ఇదే ప్రతీక. బెంగాల్‌లో దుర్గా విసర్జనం, సిందూర్ ఖేలా ఈ ఘట్టానికి గుర్తులు.

౩. పాండవులు – జమ్మి చెట్టు (మహాభారతం)

పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసం కోసం విరాటరాజు కొలువులోకి ప్రవేశించే ముందు, పాండవులు తమ దివ్యాయుధాలను జమ్మి (శమీ) చెట్టు తొర్రలో భద్రపరిచారు. విజయదశమి నాడు ఆ ఆయుధాలను తిరిగి తీసుకొని, చెట్టుకు పూజ చేసి, ధర్మ రక్షణకు సిద్ధమయ్యారు. అందుకే ఈ రోజున జమ్మి చెట్టును పూజించి, జమ్మి ఆకులను “బంగారం”గా పంచుకుంటూ శాంతి, సౌభ్రాతృత్వాలను పెంచుకుంటారు.

4. చాముండేశ్వరి – మైసూరు దసరా (కర్ణాటక సంప్రదాయం)

మైసూరులో చాముండి కొండపై చాముండేశ్వరీ దేవి (దుర్గాంశ) మహిషాసురుని వధించిన ఘట్టాన్ని దసరాగా స్మరిస్తారు. దీపకాంతులతో వెలుగొందే మైసూరు వీధుల్లో రాజసంగా సాగే జంబూ సవారీ (గజ ఊరేగింపు) ఈ ఉత్సవానికి మకుటం.

Primary Sidebar

Recent Posts

  • దసరా ఉత్సవ విశేషాలు
  • అలంకారం 10 – శ్రీ రాజరాజేశ్వరీ దేవి
  • అలంకారం 9 – శ్రీ మహిషాసుర మర్దినీ దేవి
  • అలంకారం 8 – శ్రీ దుర్గా దేవి
  • అలంకారం 7 – శ్రీ మహాలక్ష్మీ దేవి 

Recent Comments

No comments to show.

Archives

  • October 2026
  • September 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025

Categories

  • Balakanda
  • Blog
  • Dasara 2026
  • Featured
  • Festivals
  • Navaratri celebrations
  • Soundaryalahari
  • Srimadramayanam
  • Srimata
  • Sthotras
  • Vijayawada Durga Temple
  • Vishnu Sthotras
  • Women characters in ramayna

Copyright © 2026 · Swaadhyaayam