
| శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామా గోవిందా పురాణపురుషా గోవిందా పుండరీకాక్షా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తిని గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా దశరధనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా మత్స్యకూర్మ గోవిందా మధుసూధనహరి గోవిందా వరాహనరసింహా గోవిందా వామనభృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిదర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణ గోవిందా గోవిందాహరి గోవిందా గోకులనందన గోవిందా సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా అనాధ రక్షక గోవిందా ఆపద్భాంధవ గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా |
కమలదళాక్ష గోవిందా
కామితఫలదా గోవిందా పాపవినాశక గోవిందా పాహి మురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీ నాయక గోవిందా దినకరతేజా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తి గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్ఙ్గగదాధర గోవిందా విరజాతీరస్థ గోవిందా విరోధిమర్ధన గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామ గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరీతిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా గజారజరక్షక గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా వానర సేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడా గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘుకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా వజ్రకవచధర గోవిందా వైజయంతిమాల గోవిందా వడ్డీకాసులవాడా గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుకసంస్తుత గోవిందా స్త్రీపుంరూపాహరి గోవిందా శివకేశవమూర్తి గోవిందా గోవిందాహరి గోవిందా గోకులనందన గోవిందా |
బ్రహ్మాండరూపా గోవిందా
భక్తరక్షక గోవిందా నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాథీరామప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా స్వయంప్రకాశ గోవిందా అశ్రితపక్ష గోవిందా నిత్యశుభప్రద గోవిందా నిఖిలలోకేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా అభందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షక గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా శేషాద్రినిలయా గోవిందా శేషాశాయిని గోవిందా శ్రీశ్రీనివాసా గోవిందా శ్రీవేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా ∗∗∗ |
